Published On: Tue, May 15th, 2018

జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ సేవ‌లో అనీల్ అంబానీ

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ ‌అంబానీ సోమ‌వారం ఉద‌యం ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌నక‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య ఈవో ఎం.ప‌ద్మ‌, పాల‌క‌మండ‌లి ఛైర్మ‌న్ య‌ల‌మంచిలి గౌరంగ‌బాబు, అధికారులు ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నం, ప్ర‌త్యేక పూజ‌లు అనంత‌రం వేద పండితులు అనీల్ అంబానీకి ఆశీర్వ‌చ‌నం ఇచ్చారు. ఈవో ప‌ద్మ‌, పాల‌క‌మండ‌లి స‌భ్యులు ఆయ‌న‌కు అమ్మ‌వారి చిత్ర‌ప‌టంతో పాటు ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

Just In...