Published On: Wed, Sep 13th, 2017

జ‌న‌హృద‌య నేత చంద్ర‌బాబు

* ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాబోయే సమాజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘విజేత చంద్రబాబు’ పేరిట ప్రముఖ సైకాలజిస్టు డాక్టరు టి.ఎస్‌.రావు రూపొందించిన లఘచిత్ర డీవీడీని విజయవాడ మొగ‌ల్రాజ‌పురంలోని సాంస్క్ర‌తిక కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, తెదేపా సీనియర్‌ నాయకుడు ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్ పాల్గొని సెప్టెంబ‌రు 12న (మంగ‌ళ‌వారం) సాయంత్రం ఆవిష్కరించారు. కల్చరల్‌ సెంటర్‌, ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో డీవీడీని ఆవిష్క‌రించారు. డీవీడీలో చంద్రబాబు జీవిత విశేషాలు, వ్యక్తిత్వ విశ్లేషణ, రాష్ట్రాభివృద్ధిపై తన తపన తదితర అంశాలను పొందుపరిచారు. చంద్రబాబులోని పరిపాలన దక్షత, రాజనీతి, సంక్షోభాలకు ఎదురీత, దార్శనికత, బహుముఖ ప్రజ్ఞ వంటి అంశాలు రాబోయే సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ఈ సంద‌ర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు కొనియాడారు. కార్య‌క్ర‌మంలో సాంస్క్ర‌తిక కేంద్రం సీఈవో డాక్ట‌ర్ ఈమ‌ని శివ‌నాగిరెడ్డి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమీ ప్ర‌ధాన కార్యద‌ర్శి గోళ్ల నారాయ‌ణ‌రావు, డాక్ట‌ర్ ఇండ్ల రామ‌సుబ్బారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

jana_hrudaya_netha_babu_1 jana_hrudaya_netha_babu_2

Just In...