Published On: Wed, Dec 2nd, 2020

జ‌ర్న‌లిస్టు కుమార్‌కి పూలే, అంబేడ్క‌ర్ మీడియా పుర‌స్కారం

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: న‌గ‌రానికి చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు బ‌త్తుల కుమార్‌కి పూలే-అంబేడ్క‌ర్ పుర‌స్కారం ల‌భించింది. స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్క‌ర్ స్థాపించిన మూక్ నాయక్ వార్తా పత్రిక వందేళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా, అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ సిద్ధాంతంతో ఏర్పడిన స్నేహ క్లబ్ 20 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా న‌వంబ‌రు 19 నుండి 26 వరకు వారోత్సవాలు నిర్వహించారు. వారోత్సవాలలో భాగంగా త‌న‌కు పురస్కారం లభించిందని కుమార్ తెలిపారు. బహుజనుల‌ సమస్యలను వెలికితీసే జర్నలిస్టులను గుర్తించి పూలే, అంబేడ్క‌ర్ మీడియా అవార్డుతో రెండు తెలుగు రాష్ట్రాల నుండి 35 మంది జర్నలిస్టులను ఎంపిక చేశారని, వారిలో కృష్ణా జిల్లా నుండి తనను ఎంపిక చేసి పూలే, అంబేడ్క‌ర్ ‌అవార్డుతో సత్కరించారని తెలిపారు. హైద‌రాబాద్ ల‌క్డీక‌పూల్‌లోని సంస్థ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని స్నేహ గ్రూప్ చైర్మన్ కటికల శివభాగ్యరావుతో క‌లిసి జ‌ర్న‌లిస్టుల‌కు అవార్డుల‌ను అంద‌జేసినట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, డైరెకర్లు ఆరేపల్లి రాజేంద్ర, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టు బ‌త్తుల కుమార్‌కు పాత్రికేయులు, పాత్రికేయ సంఘాల నాయ‌కులు అభినంద‌న‌లు తెలిపారు.

Just In...