Published On: Wed, Sep 18th, 2019

టీటీడీ పాలకమండలి సభ్యులు వీరే..

* ప్ర‌భుత్వం అధికారిక ప్రకటన

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం బుధవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకూ పాలకమండలిలో 16 మంది సభ్యులు ఉండగా ఈ సంఖ్యను ప్రభుత్వం ఇటీవల 25మందికి పెంచింది. వీరితో పాటు దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్‌, తుడా చైర్మన్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉంటారు. కాగా 28 మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికి తెలంగాణ నుంచి ఏడుగురికి అవకాశం ఇచ్చారు. అలాగే తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి సభ్యత్వం కల్పించారు. టీటీడీ పాలకమండలిలో పలువురు ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించారు. మహిళా కోటాలో కూడా కొందరికి అవకాశం కల్పించడం విశేషం.

టీటీడీ పాలకమండలి జాబితా…
తమిళనాడు..
1. కృష్ణమూర్తి వైద్యనాథన్
2.ఎస్.శ్రీనివాసన్
3. డాక్టర్ నిచిత ముత్తవరపు
4. కుమారగురు

తెలంగాణ…
5. జూపల్లి రామేశ్వర రావు
6. బి.పార్థసారథి రెడ్డి
7.యు.వెంకట భాస్కరరావు
8. మూరంశెట్టి రాములు
9.డి.దామోదరరావు
10. కె.శివకుమార్
11. పుట్టా ప్రతాప్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్…
12. వి. ప్రశాంతి
13. యు.వి.రమణమూర్తి
14. మల్లికార్జున రెడ్డి (ఎమ్మెల్యే)
15. గొల్ల బాబూరావు (ఎమ్మెల్యే)
16. నాదెండ్ల సుబ్బారావు (ఎమ్మెల్యే
17. డి.పి.అనంత
18. చిప్పగిరి ప్రశాంత్ కుమార్
19. కె.పార్థసారథి (ఎమ్మెల్యే)

ఢిల్లీ…
20. ఎం.ఎస్.శివ శంకరన్

కర్నాటక…
21. రమేశ్ శెట్టి
22. సంపత్ రవి నారాయణ
23. సుధ నారాయణ మూర్తి

మహారాష్ట్ర…
24. రాజేశ్ శర్మ
టీటీడీ నుంచి.. ఎక్స్ అఫిషియో మెంబర్లు
25. తుడా చైర్మన్
26.స్పెషల్ సీఎస్
27. దేవాదాయ శాఖ కమిషనర్
28. టీటీడీ ఈవో

Just In...