Published On: Wed, Jul 10th, 2019

టూరిస్ట్‌ బస్సు బోల్తా ముగ్గురి దుర్మ‌ర‌ణం..

సెల్ఐటి న్యూస్‌, పాడేరు: విశాఖ మన్యం పాడేరు ఘాటు రోడ్డులో ప్రైవేటు బస్సు బోల్తా పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో 37 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రగాయాలైన నలుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కాకినాడకు చెందిన భక్త బృందం ఒడిశాలోని మజ్జిగౌరమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పాడేరు మండలం వంట్లమామిడి వద్ద అర్ధరాత్రి 12 గంటల సమయంలో బస్సు బోల్తాపడింది. అయితే మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలు చేపట్టడం ఆలస్యమైంది. దీనివల్ల బాధితులు మూడు గంటలపాటు వర్షంలోనే అవస్థలు పడ్డారు.

Just In...