Published On: Thu, Jul 30th, 2020

టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యం

* వచ్చే మూడేళ్లలోనే ఆ లక్ష్యాన్ని అందుకునే దిశగా ముందడుగు

* మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యం అని వచ్చే మూడేళ్లలోనే ఆ లక్ష్యాన్ని అందుకునే దిశగా ముందడుగు వేస్తున్న‌ట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని త‌న నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెజాన్ ప్రతినిధులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశం నిర్వ‌హించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మలచాలన్నది ముఖ్యమంత్రి స్వప్నమన్న మంత్రి మేకపాటి. అమెజాన్ నేతృత్వంలో సాధికారతతోపాటు మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే ‘సహేలి’ కార్యక్రమంపై మంత్రికి వివరణ. హస్తకళలు, బొమ్మల తయారీ, వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసే మహిళలను ప్రోత్సహించడమే సహేలి. స్థానికంగా
తయారయ్యే వస్తువులకు మార్కెటింగ్, శిక్షణ, ప్రోత్సాహం, అమ్మకం వరకూ అన్నింటిలో అండ. పరిపాలన, వినూత్న ఆలోచనలన అమలుకు శ్రీకారం. ఐ.టీ రంగంలో రాణిస్తున్నది ఎక్కువగా తెలుగువారే. ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఏపీకి తిరిగి వచ్చే స్థాయిలో ఐ.టీ అభివృద్ధి. ప్రభుత్వ పాలనలో  ఐ.టీ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తాం. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో విప్లవాత్మక మార్పులలో అమెజాన్  దృష్టి. చిన్న చిన్న ఆలోచనలతో  సమయం, వ్యయాల ఆదా. రాష్ట్రంలో రానున్న 30 నైపుణ్య కాలేజీలలో.. ఒకచోట అమెజాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ . చిన్న సంస్కరణలతోనే ఊహించని అభివృద్ధికి అవకాశం. పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తాం. టెక్నాలజీతో సంక్షేమం, పథకాలను ప్రజల ఇళ్లకు చేరుస్తాం. వినూత్న ఆలోచనలు కొత్త టెక్నాలజీ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు పెద్దపీట. ఐఎస్‌బీ, అమెజాన్‌ల భాగస్వామ్యంతో ప్రజల ప్రాథమిక హక్కులను మరింతగా నెరవేరుస్తాం. నైపుణ్యం, స్టార్ట్ అప్, మెషిన్ లెర్నింగ్, డేటా సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్, వర్క్ ఫ్రమ్ హోమ్, సెన్సార్ ఆధారిత టెక్నాలజీలలో అమెజాన్ భాగస్వామ్యానికి  అవకాశాలపై చర్చ. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వర్చువల్ సమావేశానికి హాజరయిన ఐ.టీ శాఖ కార్యదర్శి భాను ప్రకాశ్,  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుందర్, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (AISPL) సంస్థ ఎండీ, రాహుల్ శర్మ, స్టేట్స్ అండ్ లోకల్ గవర్నమెంట్ విభాగాధిపతి అజయ్ కౌల్,  పబ్లిక్ పాలసీ హెడ్, లొబొ,  సొల్యుషన్స్ ఆర్కిటెక్చర్ విభాగం, దుర్గాప్రసాద్ కాకరపర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...