Published On: Mon, Sep 9th, 2019

డాక్టర్ అపర్ణ కు “నృత్య శిరోమణి” బిరుదుతో సత్కారం..

సెల్ఐటి న్యూస్, అమరావతి: గడచిన మూడు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యంలో ప్రసిద్ధి పొందిన విజయవాడ కళాకారిణి, భారతీ రాఘవ నృత్య శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ అపర్ణ ప్రసాద్ ను హైదరాబాదుకు చెందిన గోల్డెన్ స్టార్ యూత్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంస్థ “నృత్య శిరోమణి” బిరుదుతో సత్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాదు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య కళా నిలయంలో ఆదివారం జరిగిన సంస్థ 30వ వార్షికోత్సవ సభలో తెలంగాణ రాష్ట్ర పార్లమెంటు సభ్యులు బి.బి.పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని కూచిపూడి నృత్య రంగంలో అపర్ణ చేసిన కృషిని అభినందించారు. పారిశ్రామికవేత్త కాచం సత్యనారాయణ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు బింగి నరేందర్ గౌడ్, కార్యదర్శి సాయిలు తదితరులతో పాటు పలు  కళా సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.

Just In...