Published On: Mon, Nov 12th, 2018

డిఎస్సీ-2018 ద‌ర‌ఖాస్తులో త‌ప్పుల స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం

* పాఠ‌శాల విద్యాశాఖ క‌మీష‌న‌ర్ కె.సంధ్యారాణి

సెల్ఐటి న్యూస్‌, ఇబ్ర‌హీంప‌ట్నం: డిఎస్సీ-2018కి సంబంధించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న సంద‌ర్భంలో చేసిన‌ త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవ‌డానికి అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ క‌మీష‌న‌ర్ కె.సంధ్యారాణి తెలిపారు. ఈ మేర‌కు క‌మీష‌న‌ర్ సోమ‌వారం ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. డీఎస్సీ 2018 ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్పుడు అభ్య‌ర్థులు ఏవైనా త‌ప్పుగా వివ‌రాలు ఎంట‌ర్ చేసి వుంటే వాటిని స‌రిదిద్దుకొనే అవ‌కాశాన్ని క‌ల్పించామ‌న్నారు. https://cse.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి వివ‌రాల‌ను స‌రిచేసుకోవ‌చ్చ‌న్నారు. ఇంపార్టెంట్ లింక్స్ కాల‌మ్‌లో డిలిటీ స‌బ్‌మిట్ కాలమ్ వుంటుంద‌ని, అందులో ఏ విధంగా డిలిట్, చేసి స‌బ్‌మిట్ చేయాల‌నే విష‌యాన్ని యూజ‌ర్ మాన్యుల్‌లో వివ‌రించామ‌న్నారు. దాని ప్ర‌కారం త‌ప్పుల‌ను స‌రిదిద్దుకోవాల‌న్నారు. ఒకవేళ రెండోసారి తిరిగి త‌ప్పు చేసిన‌ట్ల‌యితే తిరిగి స‌వ‌ర‌ణ‌ల చేసుకొనే అవ‌కాశం వుండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌ధ్యంలో అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు స‌వ‌ర‌ణ చేసేట‌ప్పుడు క్షుణ్ణంగా ప‌రిశీలించి త‌ప్పులు దిద్దుకోవాల‌ని క‌మీష‌న‌ర్ కె.సంధ్యారాణి అభ్య‌ర్థుల‌కు సూచించారు.

Just In...