Published On: Fri, Nov 30th, 2018

డిసెంబర్ 31కి సివిల్ కోర్టు నిర్మాణ పనులను పూర్తి చేస్తాం

* అమరావతిలో నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రాతిలో నిర్మిత‌మ‌వుతున్న తాత్కాలిక సివిల్ కోర్ట్ నిర్మాణ ప‌నుల‌ను డిసెంబర్ 31 నాటికి పూర్తి చేస్తామ‌ని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి పి.నారాయ‌ణ చెప్పారు. అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న సివిల్‌కోర్టు, హైకోర్టు, ప్ర‌జాప్ర‌తినిధుల భ‌వ‌నాల నిర్మాణాల‌ను శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఎల్ అండ్ టి సంస్థ ప్ర‌తినిధులు ప‌నులు ఏ మేర‌కు వ‌చ్చాయో మంత్రికి వివ‌రించారు. అనంత‌రం మంత్రి నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ న్యాయ‌మూర్తుల కోసం ఉండవల్లిలో నివాసాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ప్రి క్యాస్ట్ టెక్నాలజీతో హైకోర్టు నిర్మాణాలు జరుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. దేశంలో ఏ రాజధాని ఇంత వేగంగా నిర్మాణాలు జరగలేద‌ని, వ‌చ్చే ఏడాది మార్చి నాటికి అన్ని నిర్మాణాలు పూర్తి అవుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్మాణం పూర్తైన భవనాలను ప్రారంభిస్తాం అని తెలిపారు. రాజధాని నిర్మాణంపై ప్రతిపక్షాల ఆరోపణలు అర్ధరహితం అన్నారు. రాజధాని నిర్మాణంపై ఆరోపణలు చేసేవాళ్ళు అమరావతి వచ్చి చూడాల‌ని కోరారు.
 

Just In...