Published On: Thu, Aug 15th, 2019

డీజీపీ కార్యాలయంలో రాఖీ సందడి..

సెల్ఐటి న్యూస్, అమరావతి: మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవం, రక్షాబంధన్‌ను పురస్కరించుకొని నగరానికి చెందిన చైల్డ్‌ లైన్‌, వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో అనాథ ఆశ్రమం నుంచి వచ్చిన విద్యార్థులు, చిన్నారులు డీజీపీని ఆయన కార్యాలయంలో కలిసి రాఖీలు కట్టారు. వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించి వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం వారికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతం సవాంగ్‌ మాట్లాడుతూ.. మహిళల రక్షణకై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో మహిళా మిత్రలను ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా సమస్య వస్తే మహిళలు నిర్భయంగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

Just In...