Published On: Mon, Mar 15th, 2021

తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్య

గుంటూరు క్రైం, సెల్ఐటి న్యూస్‌: తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకును తండ్రి దారుణంగా కొట్టి హత్య చేసిన సంఘటన నకరికల్లులో జరిగింది. కొనతం తిమ్మారెడ్డి అనే వ్యక్తి మద్యానికి అలవాటుపడి మద్యం తాగడానికి డబ్బుల కోసం ప్రతిరోజు తల్లిదండ్రులను వేధిస్తుండండంతో  కొడుకు వేధింపులను భరించలేక తండ్రి ఇంట్లో ఉన్న సుత్తితో తన కొడుకు తిమ్మారెడ్డిని ఆదివారంనాడు తీవ్రంగా కొట్టాడు. దెబ్బలు భరించలేక తిమ్మారెడ్డి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Just In...