Published On: Fri, Sep 8th, 2017

తాటాకు చప్పుళ్లకు భయపడే ప్ర‌స‌క్తి లేదు..

* ఉర‌వ‌కొండ బ‌హిరంగ స‌భ‌లో సీఎం చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, అనంతపురం: తాటాకు చప్పుళ్లకు తాను భయపడే ప్ర‌స‌క్తి లేద‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం అనంత‌పురం జిల్లాలోని ఉరవకొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతపురం జిల్లాను పండ్ల తోటల హబ్‌గా మారుస్తామన్నారు. అలాగే ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.6 వేలు ఇచ్చామన్నారు. త్వరలోనే మరో రూ.4 వేలు ఇస్తామన్నారు. 40 వేల మంది బీసీ యువతులకు పెళ్లి కానుక అందజేస్తామన్నారు. నీతివంతమైన పాలన అందించాలని కంకణం కట్టుకున్నామని, కుల, మతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.
cm_urvakonda_jalaharati_3 cm_urvakonda_jalaharati_2 cm_urvakonda_jalaharati_4 cm_urvakonda_jalaharati_1

Just In...