Published On: Tue, Mar 19th, 2019

తితిదే పాల‌క‌మండ‌లి స‌భ్య‌త్వానికి బొండా ఉమా రాజీనామా

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యత్వానికి బొండా ఉమామహేశ్వరరావు, రాయపాటి సాంబశివరావు, బీకే పార్థసారథి మంగ‌ళ‌వారం రాజీనామా చేశారు. వీరంతా ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పాలకమండలి సభ్యుడిగా కొనసాగితే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందన్న భావనలో ఉన్న వీరు టీటీడీ పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల సమయంలో సండ్ర వెంకట వీరయ్య పాలకమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీటీడీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ కూడా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నందున ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Just In...