Published On: Thu, Nov 8th, 2018

తిత్లీ తుపాను బాధితుల‌కు సీఆర్డీఏ ఉద్యోగుల విరాళం

* సీఎం చంద్ర‌బాబుకు అంద‌జేసిన సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ చెరుకూరి శ్రీధ‌ర్‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: తిత్లీ తుపాను బాధితులపై సీఆర్డీఏ ఉద్యోగులు త‌మ దాతృత్వాన్ని చూపారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రూ.5.45 లక్షల చెక్కును సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ గురువారం  ఉండవల్లి ప్రజావేదికలో సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిగిన సందర్భంగా రూ.5.45 లక్షల చెక్కును అందజేశారు. తిత్లీ బాధితులకు సాయం అందించేందుకు విరాళాలుగా ఇచ్చిన సీఆర్డీఏలోని 410 మంది ఉద్యోగుల‌ను ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అభినందించారు.

Just In...