Published On: Thu, Nov 19th, 2020

తిరుపతి ఉప ఎన్నికపై ముఖ్య‌మంత్రిదే తుది నిర్ణయం

* అభ్యర్థిత్వాన్ని నిర్ణయించాలని ఏకగ్రీవంగా కోరాం

* డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యే గోవర్థన్ రెడ్డి వెల్ల‌డి

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహ‌న్ రెడ్డి తీసుకునే నిర్ణయానికే తామంతా కట్టుబడి వుంటామని తిరుపతి పార్లమెంట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తిరుపతి ఎంపి ఉప ఎన్నికకు సంబంధించిన అభ్యర్థిత్వం ఖరారుపై సీఎం జ‌గ‌న్‌తో పలువురు నేతలు గురువారం భేటీ అయ్యారు. ఈ మేరకు సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం మీడియా పాయింట్ వద్ద డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిలు మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి సీఎం అందరి అభిప్రాయాలను తీసుకున్నారని తెలిపారు. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా సీఎం సరైన నిర్ణయం తీసుకోవాలని అందరు నేతలు ఏకగ్రీవంగా కోరామని వెల్లడించారు. సీఎం నిర్ణయించిన అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. త్వరలోనే సీఎం జ‌గ‌న్ అభ్యర్థిని ప్రకటిస్తారని వెల్ల‌డించారు. సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయిన వారిలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్, బొత్స సత్యనారాయణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్‌ రెడ్డి, వరప్రసాద్, బి.మదుసూదన్‌ రెడ్డి, కె.ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు.

Just In...