Published On: Thu, Jul 18th, 2019

తిరుపతి-కాకినాడ మధ్య 80 ప్రత్యేక రైళ్లు

సెల్ఐటి న్యూస్‌, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి- కాకినాడ టౌన్‌ స్టేషన్ల మధ్య 80 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేర‌కు గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌త్యేకంగా న‌డ‌ప‌నున్న ఈ రైళ్లు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 1 నుంచి‌ నవంబర్‌ 1 వరకు ఈ రైళ్లు నడుస్తాయని తిరుపతిలో 07432 నంబరు గల రైలు ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. తిరిగి కాకినాడ టౌన్‌లో 07431 నంబరు గల రైలు ప్రతి సోమ, బుధ, శుక్ర వారాల్లో రాత్రి 9 గంటలకు బయల్దేరి ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైళ్లు రేణిగుంట, శ్రీకాళహస్తి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్ల కోట స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయి.

Just In...