Published On: Sat, Mar 16th, 2019

తిరుమలకు చంద్రబాబు.. హారతిచ్చిన భువనేశ్వరి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఎన్నికల శంఖారావం పూరించేందుకు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ‌నివారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని నివాసంలో ఆయ‌న సతీమణి నారా భువనేశ్వరి ఎదురొచ్చి హారతి ఇచ్చారు. అనంతరం భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్‌తో కలిసి హెలికాప్టర్‌లో తిరుమల బయలుదేరి వెళ్లారు. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో పసుపు దళాన్ని సన్నద్ధం చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ‌నివారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తిరుమలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నాక తిరుపతి చేరుకుని తారకరామ స్టేడియంలో కార్యకర్తలు, క్రియాశీల నేతలు, సేవా మిత్రలు, అభిమానులతో సభ నిర్వహించనున్నారు. అనంతరం విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం వెళ్లనున్నారు. అక్కడి కోడి రామ్మూర్తి స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పార్టీ ఎజెండాను, ప్రభుత్వ మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత వారికి వివరించి చైతన్యపరచనున్నారు.

Just In...