Published On: Sat, Nov 21st, 2020

తిరుమలలో వైభవంగా పుష్పయాగం…

తిరుమల, సెల్ఐటి న్యూస్‌: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని తితిదే ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 9 నుంచి 11గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు వివిధ రకాల పూలు, పత్రాలతో స్వామి వారికి పుష్పార్చన చేయనున్నారు. ఇందు కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి 7 టన్నుల పూలను తితిదే సేకరించింది. భక్తులు విరాళంగా పంపిన ఈ పూలకు ముందుగా పూలమాలలు తయారుచేసే గదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తితిదే ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పూల గంపలను ఊరేగింపుగా ఆలయానికి తరలించారు. పుష్పయాగాన్ని పురస్కరించుకొని ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని తితిదే రద్దుచేసింది.

Just In...