Published On: Mon, Dec 2nd, 2019

తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తోన్న వైకాపా ప్రభుత్వం

* టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమత ప్రస్తావన భక్తుల మనోభావాలను గాయపరుస్తోంది

* బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ మాజీ ఛైర్మ‌న్ వేమూరి ఆనంద సూర్య

సెల్ఐటి న్యూస్‌, గుంటూరు: ప్ర‌పంచ దేశాలలోనే అగ్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ కోట్లాది హిందువుల మనోభావాలకు స్ఫూర్తిగా నిలిచే అత్యంత ప్రతిష్టాత్మక ఆలయం.. తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి దేవాలయానికి సంబంధించి భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుంది. కానీ తిరుమల పవిత్రతను, ఆగమ శాస్త్రం విలువలను మంటగొలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. తిరుమల ఏడు కొండలు కాదు రెండు కొండలేనని జీవో తెచ్చిన తండ్రి వైఎస్సార్‌కి తగ్గ తనయుడిగా పవిత్ర పుణ్యక్షేత్రం విషయంలో సీఎం జగన్‌ ప్రవర్తిస్తున్నారు. తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం మొదలు టీటీడీ వెబ్‌సైట్‌లో ఏసుక్రీస్తు బోధనల పుస్తకాలు అప్‌లోడ్‌ చేయడం, టీటీడీలో అన్యమతస్తులు విధులు నిర్వర్తించడం, అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిధుల తగ్గింపు, పవిత్ర తిరుమల దేవాలయంపై మంత్రుల పరుష పదజాలంతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. తాజాగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోని పంచాంగ సమాచారంలో… ‘శ్రీ యేసయ్య’ అనే అక్షరాలు వెంకన్న భక్తులను తీవ్రంగా కలిచివేశాయి. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని గానీ అన్యమత దైవాన్ని కానీ కలలో కూడా ఊహించుకోలేని భక్తులకు ఇది తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది. పదేపదే తెలుగుదేశం పార్టీపై లేని ఆరోపణలను గుప్పించే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, వైసీపీ నాయకులు మల్లాది విష్ణు దీనికి ఏం సమాధానమిస్తారు..? తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను మంటగలిపిన వారందరూ దేవుని శిక్షకు గురైన వారే. ఇప్పటికైనా మీ వ్యవహారశైలి మార్చుకుని తిరుమలలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోండి. లేకుంటే హిందువులందరూ సంఘటితమై పోరాటానికి దిగిన రోజున.. మీరు మీ ప్రభుత్వం కనుమరుగవడం ఖాయం.

Just In...