Published On: Tue, Oct 20th, 2020

తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు ప్రారంభించాల‌ని సీఎం జ‌గ‌న్‌కు ఆహ్వానం…

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించాలని కోరుతూ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ నరసింహమూర్తి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని కోరారు. ఈ సంద‌ర్భంగా తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగ‌ళ‌వారం సీఎం జగన్‌ను కలిసి ఆహ్వానించారు. ఈ నెల 20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జ‌రుగుతాయ‌న్నారు. అనంత‌రం ముఖ్య‌మంత్రికి వేద ఆశీర్వ‌చ‌నం చేసి జ్ఞాపిక‌ను అంద‌జేశారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Just In...