Published On: Wed, Jan 13th, 2021

తుడా ఉద్యోగులకు చైర్మెన్ చెవిరెడ్డి సంక్రాంతి కానుక

* లెనిన్ శారీ, రేమాండ్ డ్రెస్ మెటీరిల్ అందజేత

* సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన చెవిరెడ్డి

తిరుపతి, సెల్ఐటి న్యూస్‌: ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మ‌రోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నియోజకవర్గ ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి, పార్టీ శ్రేణులకు, సమాజ శ్రేయస్సును ఆకాంక్షించి పనిచేస్తున్న జర్నలిస్టులు.. ఇలా దాదాపు 25 వేల మందికి సంక్రాంతి కానుకను అందిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. మంగళవారం తుడా కార్యాలయంలో అత్యంత నాణ్యమైన లెనిన్ శారీ, రేమాండ్ డ్రెస్ మెటీరియ‌ల్‌తో కూడిన సంక్రాంతి కానుకను ఉద్యోగులందరికీ చెవిరెడ్డి మంగ‌ళ‌వారం స్వయంగా అందజేశారు. అనంత‌రం చెవిరెడ్డి తుడా ఉద్యోగులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరంగా పరితపిస్తూ పనిచేసే ప్రతి ఒక్కరూ త‌న కుటుంబ సభ్యులేనని అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతికి కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించాలని నిర్ణయించినట్లు వివరించారు. గత ఏడాదిలో కరోనా మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో, కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, కార్యదర్శి లక్ష్మీ, ప్రణాళిక విభాగం అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Just In...