Published On: Fri, May 3rd, 2019

తుపాన్ బాధితుల కోసం యాప్‌న్న హ‌స్తం..!

* పీపుల్ ఫ‌స్ట్ యాప్‌లో ప్ర‌త్యేక ఏర్పాట్లు

* న‌ష్టం ఫోట‌ల‌ను పంపితే చాలు

* క్రౌడ్ సోర్సింగ్ ద్వారా త‌క్ష‌ణ  మ‌దింపు, ప‌రిహారం చెల్లింపు

* ఆర్టీజీఎస్ ప్ర‌త్యేక వెబ్‌సైట్‌లో ప‌ర్య‌వేక్ష‌ణ‌

* ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన ఆర్టీజీఎస్‌

* చిత్రాల‌ను మ్యాపింగ్ చేసిన సంస్థ‌

* అనుమానాలుంటే 1100 కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేయాలి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఫోనీ తుపాన్ బాధితుల‌ను ఆదుకోవ‌డానికి రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. కోస్తా ప్రాంతంలో తపాన్ ధాటికి ఆస్తిన‌ష్టం , పంట న‌ష్టం వాటిల్లే సూచ‌న‌లుండ‌టంతో బాధితుల‌కు త‌క్ష‌ణం ప‌రిహారం అందేలా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. తుపాన్ వ‌ల్ల న‌ష్ట‌పోయిన‌, దెబ్బ తిన్న బాధితులు త‌మ‌కు వాటిల్లిన న‌ష్టం మ‌దింపు వేయ‌డానికి అధికారుల కోసం ఎదురు చూడ‌కుండ వారే వాటిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చేలా ఆర్టీజీఎస్ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం పీపుల్ ఫ‌స్ట్ యాప్‌లో ప్ర‌త్యేక స‌దుపాయాలు క‌ల్పించింది. తుపాన్ ప్రాంతంలో ప్ర‌జ‌లు త‌మ‌కు వాటిల్లిన న‌ష్టం తాలూకూ త‌మ సెల్‌ఫోన్ ద్వారా ఫొటో తీసి ఈ యాప్‌లో పొందుప‌రిస్తే చాలు. ఈ ఫొటోల‌ను ఆర్టీజీఎస్ క్రౌడ్ సోర్సింగ్ ద్వారా సంబంధిత విభాగాల‌కు, తుపాన్ ప్ర‌భావిత ప్రాంతంలోని క్షేత్ర స్థాయి అధికారుల‌కు పంపుతుంది. ఈ ఫొటోల ఆధారంగా వారు త‌క్ష‌ణం దానికి సంబంధించి మదింపు పూర్తి చేస్తారు. అనంత‌రం న‌ష్టం తాలూకూ ప‌రిహారాన్ని ప్ర‌భుత్వం నేరుగా బాధితులు, రైతుల ఖాతాలోకే జ‌మ చేస్తుంది.  దీనికంతా బాధితులు చేయ‌వ‌ల్సింద‌ల్లా పీపుల్ ఫ‌స్ట్ యాప్‌ను  డౌన్‌లోడు చేసుకోవ‌డ‌మే.
ఇలా డౌన్‌లోడు చేసుకోండి…
* గుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి పీపుల్ ఫ‌స్ట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
* యాప్‌లో మీ ఆధార్ నంబ‌ర్‌, గ్రామం, మండ‌లం, జిల్లా విరాల‌ను న‌మోదు చేయాలి.
* మీ ఫిర్యాదును న‌మోదు చేయాలి
* మీ పొలం స‌ర్వే నెంబ‌రు, పంట, జ‌రిగిన న‌ష్టం వివ‌రాలు న‌మోదు చేయాలి.
* మీకు వాటిల్లిన న‌ష్టం తాలూకూ చిత్రాల‌ను  యాప్‌లో అప్‌లోడు చేసి పంపాలి
* పీపుల్ ఫ‌స్ట్ యాప్‌ను https://bit.ly/2CpNR25 లింక్ ద్వారా లేదా      http://prajasadhikarasurvey.ap.gov.in/Fani/index.html”  లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకో వ‌చ్చు.
* ఫోని తుఫాను వల్ల మీకు జరిగిన నష్టానికి సంబందించిన అర్జీలను కైజాల “AP CM కనెక్ట్” http://bit.ly/2URm3ta ద్వారా కానీ, RTGS వెబ్ సైట్ నందు కానీ https://www.rtgs.ap.gov.in పీపుల్ ఫస్ట్ యాప్ http://bit.ly/2GSfWjh ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఫోని తుఫాను డాష్ బోర్డ్ ను http://bit.ly/2Vctd08  లింక్ ద్వారా వీక్షించగలరు.
ప్ర‌త్యేక మ్యాపింగ్‌…
తుఫాన్ వ‌ల్ల వాటిల్లిన న‌ష్టం గురించి ప్ర‌జ‌లు పీపుల్ ఫ‌స్ట్ యాప్‌కు పంపిన చిత్రాల‌ను రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ క్రౌడ్ సోర్సింగ్ ద్వారా మ్యాపింగ్ చేసింది. మ్యాప్‌లో పంట‌న‌ష్టం, కూలిన చెట్లు, దెబ్బ‌తిన్న ఇళ్లు, త‌దిత‌ర 11 అంశాల‌ను విభ‌జించింది. ఎవ‌రైనా స‌రే అందులోకి వెళ్లి అక్క‌డ క్లిక్ చేయ‌గానే ఆ  ప్రాంత ప్ర‌జ‌లు పంపిన చిత్రాలు, జ‌రిగిన న‌ష్టం తాలూకు వివ‌రాలు స్ప‌ష్టంగా తెర‌మీద క‌నిపించేలా ఏర్పాట్లు చేశారు. పీపుల్ ఫ‌స్ట్ యాప్‌కు బాధితులు పంపిన చిత్రాల‌ను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా త‌క్ష‌ణం సంబంధిత విభాగాల మదింపు బృందాల‌కు వెళ్లేలా చేశారు. ఈ చిత్రాల ద్వారా న‌ష్టం మ‌దింపు బృందాలు స‌కాలంలో వాటిని మదింపు వేస్తారు. దాని ఆధారంగా బాధితుల‌కు ప‌రిహారం వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జ‌మ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.
యాప్‌ను ప్ర‌జ‌లు ఉప‌యోగించుకోవాలి: ఆర్టీజీఎస్‌
ఫోనీ తుపాన్ ప్ర‌భావంతో దెబ్బ‌తిన్న శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లా ప్ర‌జ‌లు, రైతులు త‌మ‌కు వాటిల్లిన న‌ష్టం తాలూకూ ఫొటోల‌ను తీసి ఈ యాప్‌లో పొందుప‌ర‌చాల‌ని ఆర్టీజీఎస్ విజ్ఞ‌ప్తి చేసింది.  పీపుల్ ఫస్ట్ యాప్‌ను ప్ర‌జ‌లు త‌మ మొబైల్‌లోని  గూగుల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడు చేసుకోవ‌చ్చు. పీపుల్ ఫ‌స్ట్ యాప్‌ను డౌన్‌లోడు చేసుకుని గ్రామంలో ఒక్కొక్క‌రికి జ‌రిగిన న‌ష్టం తాలూకూ మూడు చిత్రాల‌ను తీసి వాటిని యాప్‌లో అప్‌లోడు చేసి, ఆ న‌ష్టం జ‌రిగిన బాధితుడి పూర్తి వివ‌రాలు, ఆధార్ నంబ‌రు, మొబైల్ నంబ‌రు పొందుప‌ర‌చ‌డంతో పాటు జీపీఎస్ వివ‌రాలు కూడా స్ప‌ష్టంగా పేర్కొంటే స‌త్వ‌రం ప‌రిహారం పొందే వీలుంటుంది.
అనుమానాలుంటే డ‌య‌ల్ 1100
ఈ యాప్ డౌన్‌లోడు చేసుకోవ‌డం, తుపాన్ న‌ష్టం చిత్రాల‌ను పంప‌డంలో ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తినా, అనుమానాలున్నా ప్ర‌జ‌లు వెంట‌నే ప‌రిష్కార‌వేదిక 1100 కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేయాల‌ని ఆర్టీజీఎస్ విజ్ఞ‌ప్తి చేసింది.  వీటిని త‌క్ష‌ణం అక్క‌డ సిబ్బంది ప‌రిష్క‌రించేలా ఏర్పాట్లు చేశామ‌ని తెలిపింది.

Just In...