Published On: Sat, Apr 4th, 2020

తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో అనాధ‌లు, అభాగ్యుల‌కు భోజ‌న విత‌ర‌ణ‌…

* వ‌రుస‌గా ఆరో రోజూ కొన‌సాగిన సేవా కార్య‌క్ర‌మాలు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: విజ‌య‌వాడ‌లోని తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21 డివిజన్‌లో 200 మంది పేదలకు, 50 మంది యాచ‌కుల‌కు, అనాధలకు, ఒడియా ఆసుప‌త్రిలోని రోగుల‌కు 6వ రోజైన శ‌నివారం కూడా భోజనం స్వయంగా తయారు చేయించి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అల్లురి శంకర్, సుంకర పెద్దబ్బాయి, పంతాల సాయిబాబు, మేడా రమేష్, గోగు గౌరీ, పుప్పాల సుబ్బారావు, కాండ్రు నాగేశ్వరరావు, రమేష్ పాల్గొన్నారు. లాక్‌డౌన్ కారణంగా భోజనం అందక ఎంతోమంది ఆక‌లితో అవ‌స్థ‌లు ప‌డుతున్న విష‌యాన్ని గుర్తించి నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి డివిజన్‌లోనూ ఈ త‌ర‌హా కార్యక్రమాలు చేయాల‌ని దేవినేని అవినాష్ ఆదేశాల మేర‌కు పుప్పాల కుమారి ఆధ్వర్యంలో పేద‌ల‌కు భోజ‌న విత‌ర‌ణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింద‌ని డివిజన్ నాయకులు పేర్కొన్నారు.

Just In...