Published On: Thu, Mar 14th, 2019

తెదేపాకు ఎమ్మెల్సీ మాగుంట రాజీనామా

సెల్ఐటి న్యూస్‌, ఒంగోలు: తన అభిమానుల కోరిక మేరకు తెదేపా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రావాలని అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో తాను ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఒంగోలు విడిచి వెళ్లొద్దని ప్రజలు కోరుతున్నారని.. తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన ప్రకాశం జిల్లాను ఎన్నటికీ వీడేది లేదని మాగుంట చెప్పారు. 2014లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ బలహీన పడటంతో చంద్రబాబు సూచన మేరకు తెదేపాలో చేరానన్నారు. చంద్రబాబుతో తమ కుటుంబానికి ఉన్న సంబంధాల దృష్ట్యా గత ఐదేళ్లలో అన్నివిధాలా ఆయన గౌరవించారని తెలిపారు.

Just In...