Published On: Wed, May 16th, 2018

తెదేపాను ఎన్నికలకు ముందే తిరస్కరించారు

* వైసీపీ న‌గ‌ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు 

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ‌: వైెఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర రెండువేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్బాన్ని పురస్కరించుకుని విజయవాడ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు ఆధ్వ‌ర్యంలో మంగళవారం సంఘీభావ పాదయాత్ర జరిగింది. ముత్యాలంపాడు శివాలయం (గవర్నమెంట్ ప్రెస్) వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతంరెడ్డి కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర బుడమేరు వంతెన మీదుగా లూనాసెంటర్ డాబాకొట్లు సెంటర్, గంగానమ్మగుడి, కృష్ణాహోటల్ సెంటర్, పైపుల రోడ్డు, ప్రకాష్‌నగర్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను అడ్డుకునేందుకు, ఆటంకాలు కల్పించేందుకు చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల ఆశీర్వాదాలతో రెండువేల కిలోమీటర్లు పూర్తిచేసుకున్నారని తెలిపారు. రాష్ర్ట రాజకీయాలను మలుపు తిప్పబోతోంది ఈ పాదయాత్ర అని అభిప్రాయపడ్డారు. ప్రారంబించిన తొలినాళ్లలో పాదయాత్రకు ప్రాధాన్యం లేకుండా చేసేందుకు చంద్రబాబు అనేక విధాలుగా ప్రయత్నించారని అన్నారు. రోజులు గడిచేకొద్దీ ప్రజలు తమ సమస్యలు తీర్చగలిగేది వైెఎస్ జగన్ మాత్రమే అని నమ్మి పాదయాత్ర దగ్గరకు వచ్చి ఆయనను కలవాలని దగ్గర్నుంచి చూడాలని వచ్చేవారితో ప్రజావెల్లువగా మారిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ అకృత్యాలను నిలదీయగలిగే సత్తా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. రాష్ర్టంలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాచేపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే ఇదే చివరదికావాలని చంద్రబాబు అన్నారని అయితే ఆ తర్వాత టిడిపి నేతలే పలుచోట్ల మైనర్ బాలికలపై అత్యాచారాలకు ఒడిగట్టారని అన్నారు. ఎన్నికలకు ఇంకా పది నెలలు సమయం ఉన్నప్పటికి ఇప్పటికే ప్రజలు చంద్రబాబు పాలనను తిరస్కరించారని పాదయాత్ర జరుగుతున్న తీరు ఇందుకు నిదర్శనంగా వివరించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా జగన్ వద్దకు వచ్చి ప్రజలు మమేకం అవుతున్న తీరును మల్లాది విష్ణు తెలిపారు. పాదయాత్రలో వైెెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కిచెందిన నేతలు బంకాభాస్కర్, అష్రోఫ్, శార్వాణిమూర్తి, ఉగ్గుగవాస్కర్, బత్తుల దుర్గారావు, కంభం కొండలరావు, సురేష్, ఏసు, శ్రీనివాస్, పట్టాభి, మారుతి, గణేష్, రవి, మహిళా విబాగం నగర అధ్య‌క్షురాలు పిల్లి కృష్ణ‌వేణి, పెనుమత్స సత్యన్నారాయణరాజు, చిన్నా మధు, గట్టుకిరణ్, విజయ్, ఉమ్మడి వెంకట్రావు, కార్పోరేటర్ కరిమున్నీసా, రుహుల్లా, మురళీకృష్ణంరాజు, అమ్ముల వివేకానంద, జక్కా ఆదినారాయణ, ఎన్ఎస్ఆర్ యుసఫ్ తదితరులు పాల్గొన్నారు.
 

Just In...