Published On: Wed, May 22nd, 2019

తెదేపా గెలుస్తుందన‌డానికి వెయ్యి కారణాలున్నాయ్!

* తెదేపా అధికార ప్ర‌తినిధి సాదినేని యామిని

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేందుకు వంద కాదు వెయ్యి కారణాలు ఉన్నాయని, వైకాపా గెలుస్తుందనడానికి వారి వద్ద ఒక్క కారణం కూడా లేదని తెదేపా అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ అన్నారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని మీడియా పాయింట్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. గురువారం లెక్కింపు కేంద్రాల వద్ద వైకాపా కార్యకర్తలు అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కేంద్రంలో గెలుపు తమదేనంటూ మోదీ సంబరపడుతున్నారని, ఎన్డీయేకు 200 సీట్లు కూడా రావని ఆమె జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో తెదేపా పక్కాగా గెలిచి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తంచేశారు. తెదేపా సర్కార్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు ఈ నమ్మకాన్ని కల్గిస్తున్నాయని యామిని అన్నారు.

Just In...