Published On: Tue, Sep 12th, 2017

తెదేపా-వైసీపీ రెండూ భాజ‌పాకు అనుబంద సంస్థలు

* ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను రాజకీయ పార్టీలుగా పరిగణించడం లేదని ఆ రెండు కూడా బిజేపికి అనుబంధ సంఘాలు అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. ఏపిసిసి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అన్నారు. నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికలు అస‌లు ఎన్నికలే కాదు అన్నారు. అవి పూర్తిగా  అనైతికంగా జరిగాయ‌న్నారు. ఇందులో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. తాము సాక్ష్యాధారాలతో వారికి ఫిర్యాదులు ఇచ్చిన విషయం గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రరత్నభవన్‌లో మంగళవారం రెండు సమావేశాలు జరిగాయ‌ని తెలిపారు. మొదటిది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అధికారి కె.హెచ్.మునియప్ప ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగిందని ఈ సమావేశంలో జిల్లాల డిఆర్వోలు, జిల్లా మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ 80 శాతం పూర్తైంద‌న్నారు. రెండో సమావేశం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయిసింగ్ ఆధ్వర్యంలో జరిగింద‌ని తెలిపారు. రెండు ప్రధానమైన అంశాల గురించి మాట్లాడటం జరిగిందన్నారు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎలక్షన్‌కు సంబంధించి చాలా విపులంగా మాట్లాడుకున్నాం అన్నారు. ఈ సమావేశంలో తామంతా  చ‌ర్చించుకున్నామ‌ని తెలిపారు. దేశానికి బిజెపి చాలా ప్రమాదకరం- రాష్ట్రానికి మరింత ప్రమాదకరం అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శైలజానాధ్, పనబాక కృష్ణయ్య, కమల‌మ్మ, ఏపిసిసి ప్రధాన కార్యదర్శులు నరహారశెట్టి నరసంహారావు, భవానీ నాగేంద్రప్రసాద్, పెడన రాజు, రఫివుల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు.

congress_12-09-17_1 congress_12-09-17_2

Just In...