Published On: Mon, Jul 15th, 2019

తెదేపా హ‌యాంలో ధర్మం పేరిట అధర్మ పోరాటాలు చేశారు

* దేశ గొప్ప‌ద‌నాన్ని న‌లుదిశ‌లా చాటిన ఘ‌న‌త ప్ర‌ధాని మోదీకే ద‌క్కుతుంది

* భాజ‌పా రాజ్య‌స‌భ స‌భ్యులు సుజనా చౌదరి

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ప్రజాస్వామ్య దేశంలో అన్ని రాష్ట్రాలకు ‍ఒకే న్యాయం ఉంటుందని తెలిసినప్పటికీ తెలుగుదేశం పార్టీ హయాంలో ధర్మ పోరాట దీక్షల పేరుతో అధర్మ పోరాటాలు చేశారని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి ఆరోపించారు. భారతీయ జనతాపార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా ఆదివారం ఆయన విజయవాడకు వచ్చారు. ఈ సంద‌ర్భంగా నగరంలోని ది వెన్యూ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరికి రాష్ట్ర భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ గతంలో ఎంతో మంది ప్రధానులుగా పని చేసినప్పటికీ భారతదేశ గొప్పదనాన్ని నలుదిశలా చాటిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాను రాష్ట్రంలోనూ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. భాజపా-తెదేపా కూటమిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని ఆయ‌న పేర్కొన్నారు.

Just In...