Published On: Tue, Jul 7th, 2020

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 808 మద్యం బాటిల్స్ స్వాధీనం

* నిందితుడు అరెస్టు

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఏ.డి.సి.పి.కె.వి.శ్రీనివాసరావుకు అందిన సమాచారం మేరకు ఏ.సి.పి.వి.ఎస్.ఎన్.వర్మ, ఎస్.ఐ రవితేజ మరియు వారి సిబ్బందితో విజయవాడ, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధి, బి.ఆర్.టి.ఎస్. రోడ్డులోని పలగాని విగ్రహం ఎదురుగల అపార్ట్‌మెంట్ పైన టెంట్ హౌస్ నందు గల చిన్న గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన తెలంగాణా మద్యంను మరియు ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకుని అతని వద్ద నుండి 808 మాద్యం బాటిల్స్ మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వేసపోగు విజయకుమార్(43), అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన వ్య‌క్తిని అరెస్టు చేశారు. విచారణలో..పై నిందితుడు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంకు చెందిన ఖమ్మం జిల్లా జమలాపురం నుండి మద్యం అక్రమంగా విజయవాడకు తీసుకుని వచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఎవరికీ అనుమానం రాకుండా సత్యనా‌రాయణపురం, బి.ఆర్.టి.ఎస్. రోడ్డు సమీపంలోని పలగాని విగ్రహం ఎదురుగల అపార్ట్మెంట్ పైన టెంట్ హౌస్ నందు గల చిన్న గదిలో ఈ మద్యం బాటిల్ వాచ్మెన్ సాయంతో నిల్వ ఉంచి విజయవాడ నగరంలోని వివిద ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు ఈ మద్యం విక్రయించి లాభార్జన గడిస్తున్నట్లు వెల్లడి కావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకోని అతని వద్ద నుండి మ్యాన్స‌న్‌హౌస్  (750ML)-22 మద్యం బాటిల్స్, 2) మ్యాన్షన్ హౌస్ (180ML)-116 మద్యం బాటిల్స్, ఓల్డ్ అడ్మిరల్ (180ML) మద్యం బాటిల్స్ మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యంను గుర్తించి పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బ‌త్తిన శ్రీనివాసులు అభినందించారు.

Just In...