Published On: Wed, Jan 13th, 2021

తెలుగుజాతికి సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతూ, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, మనకంటూ ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని విధంగా గత 19 నెలలుగా మన రైతన్న సంక్షేమానికి, మన గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని, ఇకమీదటా ఇదే విధానం కొనసాగుతుందని ముఖ్యమంత్రి జ‌గ‌న్ పేర్కొన్నారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని– భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి అభిలషించారు.

 

Just In...