Published On: Wed, Jul 1st, 2020

తెలుగుతేజం వినీత క‌న్నెగంటిని అభినందించిన క‌లెక్ట‌ర్‌

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: ముప్పై సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, ఎయిమ్స్ ఢిల్లీ, మెడికల్ పి.జి. ప్రవేశ పరీక్ష 2020 ఫలితాలలో జాతీయ స్థాయిలో ప్రధమ రాంక్ కైవసం చేసుకుని ఆంద్రప్రదేశ్‌‌లో చరిత్ర సృష్టించిన తెలుగు తేజం డా.వినీత కన్నెగంటి. వినీతను అభినందించిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్. అఖిలభారత స్థాయిలో నిర్వహించిన పలు మెడికల్ పి.జి. ప్రవేశ పరీక్షలలో సత్తా చాటిన తెలుగు తేజం డా.వినీత ఆమె కుటుంబ సభ్యులతో పాటు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ వినీతను భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అభినందించి దుశ్శాలువాతో సత్కరించి, పూలమొక్కను బహూకరించారు.. చదువు పూర్తయిన తరువాత జన్మ భూమికి తనవంతు సేవ చేసి పలువురి మన్ననలు పొందాలని సూచించారు. అమె అభిరుచికి అణుగుణంగా అమె ఉన్నతికి తోడ్పాటునందిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు.
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, ఎయిమ్స్ ఢిల్లీ, మెడికల్ పి.జి. ప్రవేశ పరీక్ష 2020 ఫలితాలలో జాతీయ స్థాయిలో ప్రధమ రాంక్, పాండిచ్చేరి లోని జిప్ మర్ – జవహర్ లాల్ ఇన్ స్టిస్ట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ద్వితీయ రాంక్ ను, చంఢీఘర్ లోని పి.జి.ఐ.ఎం.ఇ.ఆర్. – పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ఆరవ రాంక్ నూ కైవసం చేసుకొని తన సత్తా చాటింది.
చంఢీఘర్ లోని పి.జి.ఐ.ఎం.ఇ.ఆర్. – పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ సంస్థలో ఎం.డి. జనరల్ మెడిసిన్ లో చేరటానికి వెళ్తూ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, ఎయిమ్స్ ఢిల్లీ, మెడికల్ పి.జి. ప్రవేశ పరీక్ష 2020 ఫలితాలలో జాతీయ స్థాయిలో ప్రధమ రాంక్ కైవసం చేసుకుని ఆంద్రప్రదేశ్ లో చరిత్ర సృష్టించిన వినీత కన్నెగంటి… అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, ఢిల్లీ, జాతీయస్థాయిలో 11 జూన్ 2020 న జరిపిన పి.జి. ప్రవేశ పరీక్ష 2020 ఫలితాలలో గుంటూరుకు చెందిన విద్యార్థిని డాక్టర్ కన్నెగంటి వినీత జాతీయ స్థాయిలో ప్రధమ రాంక్ కైవసం చేసుకుంది.. డాక్టర్ వినీత ఎం.బి.బి.ఎస్. ఎయిమ్స్, భువనేశ్వర్ లో చదివింది.. డా.వినీత స్వగ్రామం గుంటూరు జిల్లా వేమూరు మండలంలోని బూతుమిల్లి గ్రామం. వినీత తండ్రి కె.వెంకటేశ్వరరావు గుంటూరు చలపతి విద్యాసంస్థలలో జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.. అమె తల్లి మాధవీలత అంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

Just In...