Published On: Sat, Apr 20th, 2019

తెలుగు గడ్డపై పుట్టడం నా అదృష్టం

* ట్విట‌ర్‌లో ఏపి సీఎం చంద్రబాబు 

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం ఎన్నో జన్మల పుణ్యఫలం అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ తన శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి తన కార్యసాధనకు మరింత ప్రేరేపించాయని ఆయ‌న ట్విటర్‌లో పేర్కొన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ ట్వీట్లు చేశారు. ధర్మ పోరాట దీక్ష ఆరంభించి నేటికి సంవత్సరం అయిందని, 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డానని చెప్పారు. అప్పుడప్పుడూ కొంత ఆలస్యం అయినా అంతిమంగా ధర్మానిదే విజయం అని అనుభవంలో నేర్చుకున్నానని పేర్కొన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు కూడా న్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని నమ్మకం తనకుందని చంద్ర‌బాబు నాయుడు విశ్వాసం వ్యక్తంచేశారు.

Just In...