Published On: Tue, Mar 2nd, 2021

తెలుగు రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల

న్యూఢిల్లీ, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రాలకు 18వ విడత జీఎస్టీ పరిహారాన్ని కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ.4 వేల కోట్లను విడుదల చేస్తూ సోమ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి అదనపు రుణం సౌకర్యం కింద రూ.5,051 కోట్లు, స్పెషల్ విండో ద్వారా రూ.2,306 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు అదనపు రుణసౌకర్యం కింద రూ.5,017 కోట్లు, స్పెషల్ విండో ద్వారా తెలంగాణకు రూ.2,027 కోట్లు విడుదలయ్యాయి. కాగా… ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. జీఎస్టీ పరిహారంతో పాటు రాష్ట్రాలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రుల అభ్యర్థన మేరకు కేంద్రప్రభుత్వం తాజాగా జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది.

Just In...