Published On: Mon, Aug 14th, 2017

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో భారీగా వర్షం కురిసే అవకాశాలున్నట్లు విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాయలసీమలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  అలాగే మరో వారం రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో వచ్చే వారంలోనూ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Just In...