Published On: Sat, Oct 24th, 2020

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు ‘దసరా’ శుభాకాంక్షలు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు అందరికీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దసరా పండుగ ప్రతి కుటుంబానికి సకల శుభాలు చేకూర్చాలని, సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అరాచక శక్తుల స్వైరవిహారాన్ని ‘దుర్గామాత’ సహించదు. దాడులు-దౌర్జన్యాలకు పాల్పడితే అమ్మవారి ఆగ్రహం తప్పదు. శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసి, మెలిసి నివసించాలి అన్నదే దసరా పండుగ సందేశం. మహర్నవమి, విజయ దశమి పర్వదినాలు ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నింపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

Just In...