Published On: Wed, Nov 20th, 2019

*తెలుగు* వారికి అవ‌కాశాలు పెర‌గాలి…

* రామ్‌గోపాల్ వ‌ర్మ చిత్రాల్లో న‌టించాల‌ని కోరిక

* వ‌ర్థ‌మాన క‌థానాయిక కీర్తి చౌద‌రి

సెల్ఐటి న్యూస్‌, విశాఖ‌ప‌ట్నం: తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇత‌ర భాషా క‌థానాయిక‌ల‌తో స‌మానంగా తెలుగు వారికి కూడా నిర్మాత‌లు అవ‌కాశాలు క‌ల్పించాల‌ని తెలుగు అమ్మాయి, వ‌ర్థ‌మాన క‌థానాయిక కీర్తి చౌద‌రి అభిప్రాయం వ్య‌క్తం చేశారు. త‌మిళంలో ఓ చిత్రంలో న‌టిస్తూ వ్య‌క్తిగ‌త ప‌నుల‌పై బుధ‌వారం విశాఖ‌ప‌ట్నం వ‌చ్చిన ఆమె మీడియాతో త‌న అభిప్రాయాలు పంచుకున్నారు. తాను తెలుగు అమ్మాయిన‌ని పేర్కొన్న ఆమె త‌న స్వ‌స్థ‌లం హైదార‌బాద్ అని చెప్పారు. వ‌స్త్ర వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తున్న త‌న‌కు ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు నుంచి త‌మిళ చిత్రంలో న‌టించేందుకు అవ‌కాశం క‌ల్పించ‌డంతో తాను చిత్ర రంగంలోకి ప్ర‌వేశించాన‌న్నారు. తాను చ‌ల‌న‌చిత్ర రంగంలోకి ప్ర‌వేశించేందుకు త‌న త‌ల్లిదండ్రులు వెంక‌టేశ్వ‌ర్లు, సుమ‌తి ఇచ్చిన ప్రోత్సాహం త‌న విజ‌యానికి ఎంత‌గానో కార‌ణ‌మ‌య్యార‌ని ఆమె పేర్కొన్నారు. తాను తొలిసారిగా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ద్వారా కొంప‌ల్లిల్లోని ఇంట‌ర్నేష‌న‌ల్ సుచిత్ర అకాడ‌మిలో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ద్వారా బుల్లి తెర‌పై న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు. అలా రాణిస్తూ ముందుకు సాగుతున్న స‌మ‌యంలో ఓ వేడుక‌కు వెళ్లిన‌ప్పుడు త‌మిళంలో అవ‌కాశం వ‌చ్చి ఉత్త‌ర‌వేండ్ర మ‌లైవా టూ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన‌ట్లు తెలిపారు. ఆ చిత్రం డిశెంబ‌రులో రిలీజ్ అవుతుంద‌ని, త‌మిళంలోనే మ‌రొక చిత్రంలో న‌టిస్తున్న‌ట్లు కీర్తి చౌద‌రి పేర్కొన్నారు. అలాగే తెలుగులో రెండు చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించేందుకు అవ‌కాశం వ‌చ్చింద‌ని, జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి మాసాల్లో ఆ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయ‌ని తెలిపారు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గౌర‌వ‌మ‌ర్యాద‌లు ఎంతో బాగుంటాయ‌న్నారు. ఇక్క‌డ ఉన్న ప్ర‌ముఖ ద‌ర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ నిర్మించే చిత్రాల్లో న‌టించి ఎప్ప‌టికైనా మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాల‌న్న‌దే త‌న ధ్యేయ‌మ‌న్నారు. ప్ర‌ముఖ న‌టీమ‌ణీ అనూష్క అంటే త‌న‌కు చాలా ఇష్టం అని తెలిపారు. అనూష్క‌లా ఉన్న‌త‌మైన స్థాయికి ఎద‌గాల‌న్న‌దే త‌న క‌ల అని కీర్తి చౌద‌రి స్ప‌ష్టం చేశారు. ఇండ్ర‌స్టీలో ఇటీవ‌ల తెలుగు న‌టీమ‌ణులు కొర‌త చాలా ఉంద‌ని, ఆ కొర‌త తీర‌డం త‌న‌తో ప్రారంభ‌మై తెలుగు అమ్మాయిలు సినిమా రంగంలోకి ఎక్కువ‌మంది ధైర్యంగా అడుగిడాల‌ని ఆమె పిలుపునిచ్చారు. సినిమాల్లో న‌టించాల‌నే ఆస‌క్తి చాలామందికి ఉన్నా వివిధ కార‌ణాల నేప‌ధ్యంలో రాలేక‌పోతున్నార‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. బాలీవుడ్ అమ్మాయిల‌నే కాకుండా తెలుగు అమ్మాయిల‌ను కూడా తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ మ‌రింత ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు.

 

 

 

Just In...