Published On: Wed, Dec 2nd, 2020

తొల‌గించిన టెక్నికల్ అసిస్టెంట్లను కొనసాగించండి

* మంత్రి కొడాలి నానీకి వినతి

గుడివాడ‌(కృష్ణాజిల్లా), సెల్ఐటి న్యూస్‌: తూర్పుగోదావరి జిల్లాలో తొలగించిన పౌరసరఫరాల శాఖ టెక్నికల్ అసిస్టెంట్లను కొనసాగించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని)ను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరారు. మంగళవారం స్థానిక రాజేంద్రనగర్‌లోని నివాసంలో మంత్రి కొడాలి నానీని తూర్పు గోదావరి జిల్లాలో సివిల్ సప్లయిస్ కార్పోరేషన్‌లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వై.శ్యాంబాబు, కె.స్పందన, కె.ఎస్.ఎస్.శర్మ, కె.రాజేష్, కె.ప్రభాకర్, పి.శ్రీదేవి, జి.లలిత, జి.అప్పలరాజు, సీహెచ్ జ్యోతి, కె.శంకర్, బి.పూర్ణిమ, కె.సుబ్రహ్మణ్యం, సీహెచ్‌ భూషణం, జె.దిన్మయత, బి.రాహుల్, జి.సునీల్‌కుమార్, ఎస్.ఫణిబాబు, ఎస్.సాల్మన్, ఎస్.లక్ష్మణ్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది కాలంగా పౌరసరఫరాల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నామన్నారు. గత సెప్టెంబర్ 30వ తేదీ నుండి తమను విధుల నుండి తొలగించారన్నారు. దీంతో తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారులు కూడా విధుల్లోకి తీసుకుంటామంటూ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్లుగా తొలగించిన వారందరినీ కొనసాగించాలని వారు కోరారు. మంత్రి మాట్లాడుతూ ఈ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం, జాయింట్ కలెక్టర్లతో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Just In...