Published On: Sat, Sep 9th, 2017

త్వరలో తెదేపా జాతీయ, రాష్ట్ర కమిటీలు

* ఏపీ సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: త్వరలో తెదేపా జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో శ‌నివారం జ‌రిగిన క్యాబినెట్ మీటింగ్‌లో సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ cm_05-05-17ఈ నెల 11 నుంచి 50 రోజులపాటు ఇంటింటికి తెదేపా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. అతి విశ్వాసంతో వ్యవహరించవద్దని ఈ సంద‌ర్భంగా నేతలకు సూచించారు. ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణను త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ వరకు చంద్రన్న బీమా దరఖాస్తుల గడువు పెంచనున్నట్లు వెల్లడించారు. నంద్యాల, కాకినాడలో నేతలు విశేష ప్రతిభ కనబర్చారని ఈ స‌పంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు పేర్కొంటూ వారిని అభినందిస్తున్న‌ట్లు ప్రకటించారు.

Just In...