Published On: Wed, Jun 26th, 2019

త్వరలో నూతన మార్కెట్ కమిటీలు..

* మంత్రి మోపిదేవి వెంకట రమణరావు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాల నియామకాల త్వరలోనే ప్రారంభమవుతుందని పశు సంవర్ధకం, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన సమావేశంలో మార్కెటింగ్ శాఖ పని తీరును మంత్రి మోపిదేవి సమీక్షించారు. నూతధంగా ధియమించే మార్కెట్ కమిటీలన్నినంటిలోను రైతులకే అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్ధసిరికరణ నిధిని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మోపిదేవి వెల్లడించారు. రైతులను ఆదుకుని వారు పండించే పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలాగా చేయడమే తమ ప్రభుత్వలక్ష్యామన్నారు. కేంద్ర మార్కెట్ నిధుల కింద పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ళకు పెంచనున్నట్టు మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులను ఆధునుకరిస్తామని మోపిదేవి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ ఆర్ జి ఎస్ కింద మార్కెటింగ్ శాఖలో జరిగిన పనులపై ఉన్నత స్ధాయి విచారణ జరిపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆశయాలు , ఆలోచనలకనుగుణంగా మార్కెటింగ్ శాఖ పని చేయిలని అవినీతి రహిత శాఖ గా ఉండాలని మోపిదేవి సూచించారు.

Just In...