Published On: Sun, Nov 4th, 2018

త్వ‌ర‌లో చంద్ర‌బాబు జ‌గ‌న్‌తోనూ క‌లుస్తారేమో

* ఫేస్‌బుక్ వేదిక‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌లు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: కాంగ్రెస్, తెదేపా మైత్రి బంధంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఫేస్‌బుక్‌ వేదికగా విమర్శలకు దిగారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీపై చంద్రబాబు చేసిన విమర్శల్ని పవన్ తన ఫేస్ బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఒకప్పుడు ఒక‌రినొక‌రు అదేప‌నిగా తిట్టుకున్న నేతలు ఇప్పుడు ఒకటవ్వడం అవకాశవాదం కాక మరేంటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయం మరిచి తెలుగు వారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని ఘాటుగా విమర్శించారు. త్వరలో చంద్రబాబు జగన్‌తోనూ కలిసే అవకాశం లేకపోలేదని ఎద్దేవా చేశారు. అసంబద్ధంగా జరిగిన రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, భాజపా రెండూ కారణమేనన్నారు. హైదరాబాద్ నుంచి మనల్ని గెంటేయడంలో ఆ రెండు పార్టీలది కీలకపాత్ర అని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనుభవజ్ఞులైన నాయకులు ఈ విషయంలో సిగ్గుపడాలని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు.

Just In...