Published On: Thu, Nov 29th, 2018

ఉత్త‌ర ద్వార‌ద‌ర్శ‌నం కోసం తితిదే ఏర్పాట్లు

* తితిదే జేఈవో శ్రీనివాస‌రాజు వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామిని ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నంలో ద‌ర్శించుకునేందుకు వీలుగా తితిదే ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 18న‌ వైకుంఠ ఏకాదశి, 19 ద్వాదశి. డిసెంబర్ 18న ఉత్తర ద్వారం తెరవబడుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు అర్ధరాత్రి ఒకటిన్నర తర్వాత నుంచి వీఐపీలకు దర్శనం ఉంటుంద‌ని తితిదే జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఉదయం 5 గంటల తర్వాత సర్వదర్శనం భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం ఉంటుంద‌న్నారు. సుమారు 44 నాలుగు గంటలకు పాటు సర్వదర్శనం భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో సుమారు లక్షా 75 వేల మంది వరకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంద‌న్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 17 నుంచి 20 వరకు అన్ని ప్రివిలైజ్‌డ్ దర్శనాలను రద్దు చేస్తామ‌న్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్లే భక్తులను 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి వైకుంఠం టూ కంపార్ట్మెంట్‌లోకి అనుమతిస్తాం అన్నారు. అటు తర్వాత అల్వార్ ట్యాంక్ మీద నారాయణగిరి ఉద్యానవనంలోనూ భక్తులను అనుమతిస్తాం అన్నారు. అన్ని కంపార్ట్మెంట్లు నిండిన తర్వాత మెదరమెట్ల ద్వారా నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేకంగా ఎర్పాటు చేసిన షెడ్ల లోప‌ల‌కు భక్తులను అనుమతిస్తాం అన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులలో 24 గంటల పాటు ఘాట్‌ రోడ్లను తెరిచి ఉంచుతామ‌ని తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వర్ణరథం, 19వ తేదీ ద్వాదశిరోజున చక్రస్నానం నిర్వహించబడుతుంద‌ని పేర్కొన్నారు.

Just In...