Published On: Thu, Feb 25th, 2021

దుర్గగుడిలో అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు బుధ‌వారం నివేదిక ఇచ్చారు. ఉద్యోగులు, ఈఓపై ప్రభుత్వానికి పూర్తిస్ధాయి నివేదిక అందింది. ఇప్పటికే 15 మంది ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరి పాత్ర ఎంతో దానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారులు అందజేశారు. దుర్గగుడిలో అవినీతిపై దేవాదాయ శాఖకు ఏసీబీ నివేదిక అందించిన విషయం తెలిసిందే. మరో రెండురోజుల్లో మరికొందరికి చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దుర్గగుడి ఈఓపై బదిలీవేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Just In...