Published On: Wed, Apr 7th, 2021

దుర్గగుడి ఈవో బదిలీ…

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్‌‌బాబును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి రీజినల్ జాయింట్‌ కమిషనర్‌గా ఆయనను బదిలీ చేశారు. ఏసీబీ, విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడుల నేపథ్యంలో ఈవోపై వేటు వేశారు. దుర్గగుడి ఈవోగా భ్రమరాంబ నియామించారు. దుర్గగుడిలో ఫిబ్రవరిలో మూడు రోజులు విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ ఆలయంలోని అవినీతి బాగోతంపై ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించింది. ఈవో వైఫల్యాలను ఇందులో పొందుపరిచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏసీబీ తుది నివేదిక ఆధారంగా సురేష్‌‌బాబుపై చర్యలు తీసుకున్నారని స‌మాచారం.

Just In...