Published On: Sat, Sep 19th, 2020

దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే

* 42వ డివిజ‌న్ అభ్య‌ర్థి ప‌గిడిపాటి చైత‌న్య‌రెడ్డి

విజయవాడ (భ‌వానీపురం), సెల్ఐటి న్యూస్‌: దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుంద‌ని 42వ డివిజ‌న్ అభ్య‌ర్ధి పగిడిపాటి చైతన్య రెడ్డి అన్నారు. భ‌వానీపురంలోని పార్టీ కార్యాల‌యంలో శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ దుర్గగుడి ఫ్లై ఓవర్ పూర్తి చేసిన ఘనత వైయ‌స్సార్సీపీ ప్రభుత్వానికి దక్కుతుంద‌న్నారు. టీడీపీ నేతలు క్రెడిట్ కొట్టేయాలని చూడటం హాస్యాస్పదంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు. తెదేపా నేత‌ల మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేర‌ని.. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నార‌ని తెలిపారు. వైయ‌స్సార్సీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మరోసారి రుజువు చేసాం అని పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం పేరుతో టీడీపీ చేసిన అరాచకాలకు భవానీపురం ప్రజలంతా అనేక ఇబ్బందులు పడ్డార‌ని తెలిపారు. ఫ్లై ఓవర్ పనులు పరిశీలించడానికి ముందుకు రాని ఎంపీ కేశినేని నాని.. పనులు పూర్తయ్యాక హడావిడి చేస్తే వైయ‌స్సార్సీపీ నాయకులు చూస్తూ ఊరుకోర‌ని హెచ్చరించారు. 40వ డివిజ‌న్ అభ్య‌ర్థి యరడ్ల ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వం దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసింద‌న్నారు. 2015లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు 6నెలల్లో పూర్తి చేస్తాం అని కల్లబొల్లి కబుర్లు చెప్పార‌ని ఎద్దేవా చేశారు. గ్రాఫిక్స్ చూపించటం తప్ప టీడీపీ వాస్తవంగా చేసిన పనులు శూన్యం అన్నారు. ఫ్లై ఓవర్ నిధులు అమరావతికి మళ్లించిన మాట వాస్తవం కాదా అని ప్ర‌శ్నించారు. అమరావతి మీద ఉన్న ప్రేమ విజయవాడ ప్రజల మీద లేకుండా పోయింద‌న్నారు. పుష్కరాలకి పూర్తి చేస్తామని చెప్పిన కల్లబొల్లి మాటలు ప్రజలకు అర్ద‌మ‌య్యే తెదేపాకు తగిన బుద్ధి చెప్పార‌ని వ్యాఖ్యానించారు. 39వ డివిజ‌న్ అభ్య‌ర్థి గుడివాడ నరేంద్ర రాఘవ మాట్లాడుతూ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానుంద‌న్నారు. 2013లో వెలంపల్లి దీనికి డీపీఆర్ కేంద్రానికి పంపించార‌ని పేర్కొన్నారు. అప్పటి మంత్రి సర్వే సత్యనారాయణ ఫ్లై ఓవర్ కోసం రూ.300కోట్లు నిధులు విడుదల చేశార‌ని తెలిపారు. విలేక‌రుల స‌మావేశంలో ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

Just In...