Published On: Thu, Dec 6th, 2018

దుర్గగుడి మెమెంటో స్కాంలో పురోగతి

* మెమెంటోల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: విజయవాడ క‌న‌క‌దుర్గగుడి మెమెంటో కుంభకోణం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మెమెంటోల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. ఇందులో నలుగురికి ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. దసరా ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో మెమెంటోల కుంభకోణం జరిగిన విషయం విధిత‌మె. ఇందుకు సంబంధించి మొత్తం 1200 మెమెంటోలు కొనుగోలు చేసి 2వేల మెమెంటోలు కొనుగోలు చేసినట్లు బిల్లు పెట్టి అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఏఈవో అచ్యుతరామయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ సునీత, అక్కడ పనిచేసే సైదా, గోపీచంద్‌పై కేసు నమోదు చేశారు. వారిపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఈవో, సీనియర్‌ అసిస్టెంట్‌ను దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ సస్పెండ్‌ చేశారు. కొద్దిరోజుల్లోనే స‌స్సెండ్‌కు గురైన ఏఈవో అచ్యుత‌రామ‌య్య ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

Just In...