Published On: Mon, Sep 11th, 2017

దుర్గమ్మ లడ్డు ప్రసాదం పోటును పరిశీలించిన ధర్మకర్తలమండలి

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన ఇంద్ర‌కీలాద్రిపై వెల‌సిన అమ్మ‌ల‌గ‌న్న అమ్మ క‌న‌కదుర్గ‌మ్మ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్ర‌సాదం తయారీ పోటును సోమవారం ఉదయం ధర్మకర్తల మండలి చైర్మన్ య‌ల‌మంచిలి గౌరంగ‌బాబు ఆధ్వ‌ర్యంలో్ సభ్యులు కోడెల సూర్యలత కుమారి, ఇట్టా పెంచలయ్య, ఈది సాంబశివరావులు పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా దిట్టం, కళాయికి ఎన్ని లడ్డులు తయారీ అవుతున్నాయి త‌దివ‌త‌ర స‌మ‌గ్ర స‌మాచారం సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు.

 durgamma_1_11-09-17 durgamma_2_11-09-17

Just In...