దుర్గమ్మ సేవలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్
* తెలుగు ప్రజలకు సక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బండారు దత్తాత్రేయ
ఇంద్రకీలాద్రి, సెల్ఐటి న్యూస్: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబు ఆయనకు ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం గవర్నర్‌కు ఆలయ ఈవో సురేష్‌బాబు అందజేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించాలని దుర్గమ్మను కోరుకున్నట్లు తెలిపారు. వివేకానంద స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆయన సక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.