Published On: Thu, Mar 14th, 2019

దుర్గ‌మ్మకు ప‌సిడి హారం బ‌హుక‌ర‌ణ‌

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు నిఫ్టి ల్యాబ్స్ (కొండ‌ప‌ల్లి) అధినేత‌లు రూ.4.57 ల‌క్ష‌లు ఖ‌రీదు చేసే 126 గ్రాముల ప‌సిడి హారాన్ని గురువారం బ‌హుక‌రించారు. అలాగే ఇంద్ర‌కీలాద్రిపై అమ‌ల‌వుతున్న నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి రూ.1,11,116 విరాళాన్ని నిఫ్టి ల్యాబ్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డెతిరెడ్డి కేశ‌వ‌రెడ్డి, డైరెక్ట‌ర్ బి.కృష్ణారెడ్డిలు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దుర్గ‌గుడి ఈవో వి.కోటేశ్వ‌ర‌మ్మ‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా దాత‌ల‌ను ఆల‌య అధికారులు అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేయించి వేద‌పండితుల‌తో ఆశీర్వ‌చ‌నం, అమ్మ‌వారి చిత్ర‌ప‌టాన్ని, ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

Just In...