Published On: Sun, Oct 6th, 2019

దుర్గ‌మ్మ‌కు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన సీఎం జ‌గ‌న్

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: శ్రీ మహాలక్ష్మీ అవతారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం ద‌ర్శించుకుని అమ్మ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా పంచెక‌ట్టుతో సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డికి దుర్గ‌గుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబు, అర్చ‌కులు, వేద‌పండితులు ఆలయ సంప్ర‌దాయంలో పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. పర్వట్టంతో ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి అలంకరించగా, ఆయన తలపై పట్టు వస్త్రాలను మోస్తూ అమ్మవారికి సమర్పించారు. సీఎం రాక‌తో పోలీసులు భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు, ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు, జోగి ర‌మేష్‌, సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు, ప‌లువురు ఉన్న‌తాధికారులు ఉన్నారు.

Just In...