Published On: Sat, Oct 17th, 2020

దుర్గ‌మ్మ‌కు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన సీపీ దంప‌తు‌లు

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రులు ప్రారంభం సంద‌ర్భంగా పోలీస్ శాఖ త‌ర‌ఫున విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు దంప‌తులు జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు శుక్ర‌వారం ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారికి దుర్గ‌గుడి ఛైర్మ‌న్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం అమ్మ‌వారికి సీపీ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ద‌ర్శ‌నం అనంత‌రం ఆల‌య అధికారులు వేద పండితుల ఆశీర్వ‌చ‌నం, అమ్మ‌వారి ప్ర‌సాదాలు అందించారు.

Just In...